»Jabardast Comedian Panch Prasad Who Was Hospitalized Once Again
Punch Prasad : మరోసారి ఆసుపత్రిలో చేరిన జబర్దస్త్ కమెడియన్
పంచ్ ప్రసాద్(Punch Prasad)ను తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. లేదంటే పంచ్ ప్రసాద్ ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. పంచ్ ప్రసాద్ కు తోడుగా ఆయన భార్య ఉంటూ సేవలు చేస్తోంది. తన భర్త ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆరోగ్యం(Health) కాస్త కుదుటపడటంతో పంచ్ ప్రసాద్ ఇటీవలే జబర్దస్త్(Jabardasth) వేదికపై కనిపించారు.
జబర్దస్త్(Jabardasth) కామెడి షో(Comedy show) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫేవరెట్ అయిపోయింది. ఈ షోలో అందర్నీ కడుపుబ్బా నవ్వించే కమెడియన్స్ వారి నిజజీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా పంచ్ ప్రసాద్(Punch Prasad) పరిస్థితి దయనీయంగా ఉంది. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పంచ్ ప్రసాద్ బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సమస్యతో పోరాడుతూ పంచ్ ప్రసాద్ చాలా ఆస్పత్రులల్లో చికిత్స తీసుకుంటున్నాడు.
పంచ్ ప్రసాద్(Punch Prasad)ను తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు తెలిపారు. లేదంటే పంచ్ ప్రసాద్ ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. పంచ్ ప్రసాద్ కు తోడుగా ఆయన భార్య ఉంటూ సేవలు చేస్తోంది. తన భర్త ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆరోగ్యం(Health) కాస్త కుదుటపడటంతో పంచ్ ప్రసాద్ ఇటీవలే జబర్దస్త్(Jabardasth) వేదికపై కనిపించారు.
పంచ్ ప్రసాద్(Punch Prasad)కు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను ఈ ఛానెల్ ద్వారా పంచ్ ప్రసాద్ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన ఓ వీడియోను పంచ్ ప్రసాద్ రిలీజ్ చేశారు. ఓ ఇంజెక్షన్ కోసం పంచ్ ప్రసాద్ ఆస్పత్రిలో చేరినట్లుగా ఆయన భార్య తెలిపింది. పంచ్ ప్రసాద్ కుడిచేతిపై ఇప్పటి వరకూ 50 ఇంజెక్షన్లు వేశారని, డయాలసిస్ నొప్పిని ఆయన తట్టుకోలేకపోతున్నారని, ప్రసాద్ ఇంజెక్షన్స్ అంటే ఇంకా ఎక్కువగా భయపడిపోతున్నారని ఆమె తెలిపింది.
ప్రస్తుతం పంచ్ ప్రసాద్(Punch Prasad) నడిచేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె వెల్లడించింది. ఇటీవలె జ్వరంతో మరోసారి పంచ్ ప్రసాద్ ఆస్పత్రిలో చేరి కోలుకుంటున్నారని ఆమె తెలిపింది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.