»I Have My Father Pawan Kalyan Rajamouli Is The Same Too Charan Viral Comment
Ram Charan: మెగాస్టార్, పవర్ స్టార్ తర్వాత ఆయనే నా గురువు: రామ్ చరణ్
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్(RRR) తన సత్తా చాటింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఆస్కార్(OSCAR) అందుకున్న తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్(RRR) రికార్డుకెక్కింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)పై, ఆర్ఆర్ఆర్ యూనిట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్ అవార్డుల(Oscar Awards) వేడుక తర్వాత రామ్ చరణ్(Ram Charan) ఇండియా టుడే సెషన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్(RRR) తన సత్తా చాటింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఆస్కార్(OSCAR) అందుకున్న తొలి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్(RRR) రికార్డుకెక్కింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)పై, ఆర్ఆర్ఆర్ యూనిట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్ అవార్డుల(Oscar Awards) వేడుక తర్వాత రామ్ చరణ్(Ram Charan) ఇండియా టుడే సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.
దర్శకుడు రాజమౌళి(Rajamouli) అంటే తనకు ఎంతో గౌరవం అని, 14 ఏళ్లకు ముందు ‘మగధీర’ సినిమాతో తనకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారని రామ్ చరణ్(Ram Charan) తెలిపారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తర్వాత తాను ఎక్కువగా గౌరవించే వ్యక్తి రాజమౌళి అని అన్నారు. చిరంజీవి, పవన్ తనకు రెండు కళ్లలాంటి వారని, వారు లేకుండా తాను లేనని రామ్ చరణ్ తెలిపారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా అనుకున్నప్పుడు తనను, తారక్ ను ఎంచుకోవడానికి బలమైన కారణం తమ మధ్య ఉన్న స్నేహమేనని అన్నారు. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మ్యాచ్ అవుతుందని తమ ఇద్దరిని ఎంచుకున్నారన్నారు. సినిమాల్లో నందమూరి, మెగా ఫ్యాన్ పరంగా 35 ఏళ్లుగా పోటీ ఉందని, అయితే వ్యక్తిగతంగా తమ ఇద్దరి కుటుంబాల మధ్య అలాంటిదేమీ లేదన్నారు. రాజమౌళి(Rajamouli) కాకుండా వేరే దర్శకులు అయ్యుంటే తారక్, తన కాంబో అస్సలు సెట్ అయ్యేదే కాదని, ఎవ్వరూ కూడా అంతగా ఆసక్తి చూపించేవారు కాదన్నారు.