అక్కినేని ఫ్యామిలీ నుంచి తొమ్మిదేళ్ల క్రితం మనం సినిమాలో అఖిల్(Akhil) గెస్ట్ రోల్లో కనిపించాడు. ఆ తర్వాత ఏడాదికి 'అఖిల్' అనే టైటిల్ తోనే సినిమా చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా(Movie) ఫ్యాన్స్ ను ఎంతగానో నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత 'హలో' అనే సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే కమర్షియల్ ఫెయిల్యూర్ గానే అఖిల్ మిగిలిపోయిన తరుణంలో 'మిస్టర్ మజ్ను' సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు అంతగా మింగుడు పడలేదు.
అక్కినేని ఫ్యామిలీ నుంచి తొమ్మిదేళ్ల క్రితం మనం సినిమాలో అఖిల్(Akhil) గెస్ట్ రోల్లో కనిపించాడు. ఆ తర్వాత ఏడాదికి ‘అఖిల్’ అనే టైటిల్ తోనే సినిమా చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా(Movie) ఫ్యాన్స్ ను ఎంతగానో నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత ‘హలో’ అనే సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే కమర్షియల్ ఫెయిల్యూర్ గానే అఖిల్ మిగిలిపోయిన తరుణంలో ‘మిస్టర్ మజ్ను’ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కు అంతగా మింగుడు పడలేదు.
‘ఏజెంట్’ స్పాట్లో యాంకర్ సుమ:
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమా అఖిల్(Akhil)కు తొలి హిట్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అఖిల్ ఆ సినిమా సక్సెస్ జోష్ లోనే ‘ఏజెంట్'(Agent) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీకి డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Director Surendar reddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక యాక్షన్ స్పై థ్రిల్లర్(Spy Thriller) నేపథ్యంలో రూపొందుతోంది.
ఈ మూవీలో అఖిల్(Akhil) రా ఏజెంట్(Agent)గా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు, టీజర్ రిలీజ్(Teaser Release) అయ్యి భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. చాలా వాయిదాల తర్వాత ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదిన పాన్ ఇండియా(Pan India) స్థాయిలో విడుదల కానుంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది.
తాజాగా యాంకర్ సుమ(Anchor Suma)కు ఏజెంట్(Agent) అఖిల్(Akhil) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సుమ(Suma) పలు ప్రశ్నలు అఖిల్ ను అడిగారు. యాంకర్ సుమతో జరిపిన ఇంటర్వ్యూలో ఏజెంట్ సినిమా(Agent Movie) విశేషాలను, సినిమాలో తాను పడిన కష్టాలను అఖిల్ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.