MNCL: మంచిర్యాలలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం దళిత హక్కుల పోరాట సమితి 2వ జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి దేవి పోచన్న తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితుల పట్ల పాలక ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.