కృష్ణా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖ లబ్ధిదారు లింగం చిన్నారికి రూ.రెండు లక్షల క్లెయిమ్ చెక్ బ్యాంక్ అధికారులు ఎమ్మెల్యే అందచేశారు.