NZB: గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరతపై చర్యలు తీసుకోవాలని RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు డిమాండ్ చేశారు. బుధవారం నాందేవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై దాడుల ప్రభావం పేద ప్రజలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు సిలిండర్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు.