KKD: తుని మండలం అగ్రహారంలో బుధవారం అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో వరికుప్పను నూరుస్తుండగా ట్రాక్టర్ అకస్మాత్తుగా తిరగబడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ నుంచి ఆయిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ నాగం కృష్ణ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.