ADB: సోనాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రైతు సంఘం నాయకుడు తుల హరీష్ పేర్కొన్నారు.