GNTR: జిల్లా నూతన కలెక్టర్ సాయి కాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ ఇవాళ వారికి పింఛన్లు అందజేశారు. జిల్లాలో 2.53 లక్షల మంది పింఛను దారులకు రూ.110.50 కోట్ల మేర పింఛన్లు పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు.