NGKL: చారకొండ మండలం జూపల్లిలో మేకల సంతకు బుధవారం వేలం పాట గ్రామ సర్పంచ్ అనూష జగపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో జూపల్లి కి చెందిన కడారి శ్రీనయ్య రూ.5,75,352లకు దక్కించుకున్నారు. ఈ వేలం దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చారకొండ ఎంపీవో నారాయణ, కార్యదర్శి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.