VZM: ఇటీవల శాసన మండలిలో స్వల్ప అస్వస్థతకు గురై ప్రస్తుతం కోలుకుంటున్న శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పరామర్శించారు. విజయనగరంలోని బొత్స నివాసంలో పలువురు నాయకులతో కలిసి సమావేశమయ్యారు. అనంతరం బొత్స ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.