MDK: రామాయంపేట మండలంలో గురువారం ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటిస్తారని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో మండల పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. అనంతరం హనుమాన్ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.