TG: హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చికెన్ వ్యాపారులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ చికెన్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చికెన్ వ్యాపారులకు కమీషన్ మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చికెన్ వ్యాపారులు భారీగా తరలివచ్చారు. కాగా, ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్ చేసిన విషయం తెలిసిందే.