NLG: చందంపేట మండలం కంబాలపల్లిలో రెవెన్యూ భూ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. భూ రికార్డులను పారదర్శకంగా సరిచూసి, అర్హులైన ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అధికారుల నిర్ణయంపై గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.