గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ కెప్టెన్సీ తనను ఆకట్టుకుందని తెలిపాడు. తనకు అటాకింగ్ ఫీల్డ్ సెటప్ చూసి షాకైనట్లు చెప్పాడు. తన బ్యాటింగ్ సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి ఆశ్చర్యపోయానని.. తాను ఇంతకుముందు ఎప్పుడూ ఇలా షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను పెట్టడం చూడలేదని చెప్పుకొచ్చాడు.