అన్నమయ్య: తంబళ్లపల్లె మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి బుధవారం ములకలచెరువులో రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీటిని పరిశీలించారు. ఇళ్ళలోని మురికి నీటిని రోడ్లపైకి వదలవద్దని, దోమల వ్యాప్తిని అరికట్టడానికి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులు నిర్మూలించవచ్చని తెలిపారు.