KKD: గొల్లప్రోలు (M) ఏకే మల్లవరంలో పులిహోర పంపిణీ విషయంలో జరిగిన ఘర్షణ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిచ్చింది. స్థానిక రామకోవెల వద్ద అన్నసమారాధన అనంతరం మిగిలిన పులిహోరను నాగలక్ష్మి పొట్లాలు కడుతుండగా, అదే గ్రామానికి చెందిన వెంకటరమణ తనకు ఆకులో వేసి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరగటంతో వారి కుమారులు ఘర్షణకు దిగారు.