ASR: కూటమి ప్రభుత్వం నిరంతరం పేదల సేవలో ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరి అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ కే.గ్రీష్మతో కలిసి పాడేరు మండలం గుత్తులపుట్టు గ్రామంలో పలువురు లబ్దిదారులకు సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.