AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు లోక్సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ్యులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో అమరావతి రాజధానిగా కీలక అడుగు పడింది. ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమరావతికి పూర్తిస్థాయిలో అధికారిక చట్టబద్ధత లభిస్తుంది.