టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో ‘డెకాయిట్’ మూవీ రాబోతుంది. ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న విడుదల కానుంది. దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.30కోట్లు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పేర్కొన్నాయి.