లక్నో సూపర్ జెయింట్స్ ఇవాళ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. IPL 2026లో ఇరుజట్లకు ఇదే తొలిపోరు కాగా.. ఇందులో లక్నో గెలుస్తుందని క్రికెట్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. జరిగిన 4 మ్యాచుల్లోనూ హోం టీమ్స్ గెలవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. పైగా ఢిల్లీతో జరిగిన 7 మ్యాచుల్లో వరుసగా చివరి 4 గెలిచిన లక్నో జోరు మీద ఉందని చర్చించుకుంటున్నారు.