ATP: గుత్తిలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. గుత్తి ఆర్.ఎస్ పాటు, టౌన్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు వరదనీరు రోడ్డుపై నిలుస్తున్నాయి. ఈ మార్గాన వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుపై వర్షపు వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.