WNP: వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి హాస్టల్ మంజూరు చేయాలని ప్రిన్సిపల్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో అధ్యాపక బృందం ఎమ్మెల్యేను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేసింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరలోనే హాస్టల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతొ అధ్యాపకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.