సత్యసాయి: మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతుగా హిందూపురం నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేసిన బోయ మంజునాథ్‌ను CM చంద్రబాబు అభినందించారు. 14 రోజుల పాటు 726 కిలోమీటర్లు ప్రయాణించి సచివాలయానికి చేరుకున్న ఈ యువకుడి సాహసాన్ని సీఎం కొనియాడారు. అనంతరం మంజునాథ్ కోరిక మేరకు సీఎం స్వయంగా సైకిల్ తొక్కి అందరిని ఉత్సాహపరిచారు.