KMR: హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జరుపుకోవాలని బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో జరిగే హనుమాన్ ఊరేగింపు సందర్భంగా బీబీపేట, దోమకొండ, బిక్కనూర్, రాజంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.