గుంటూరు: పొన్నూరు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో మంజూరైన 14 స్పౌజ్ (విడో) పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. పెన్షన్ పొందిన వ్యక్తి మరణిస్తే భార్యకు వెంటనే పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యేే వెంట అధికారులు, నాయకులు పాల్గొన్నారు.