SRCL: ఈ నెల 7న రాజన్న ఆలయ కోడెల పంపిణీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ గోశాలలోని 300 కోడెలు మంగళవారం ఉదయం 07.00 గంటలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పరిసర జిల్లాల రైతులు అర్హులని స్పష్టం చేశారు.1.5 నుంచి 5 ఎకరాల సాగు భూమి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.