TG: విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్ ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. లోక్ సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణకు ఎన్ఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలు ఇస్తామన్నారని.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఏపీకి అదనపు నిధులు ఇవ్వడంపై తమకు అభ్యంతరం లేదన్నారు. కానీ ఏపీ తరహాలోనే తెలంగాణకు కూడా అదనపు నిధులు ఇవ్వాలన్నారు.