ATP: అనంతపురం రూరల్ పంచాయతీ సర్పంచ్ ఉదయ్ పదవీకాలం పూర్తి కావడంతో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయ్‌తో పాటు వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, పంచాయతీ అధికారులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఐదేళ్లలో పంచాయతీ అభివృద్ధికి ఉదయ్ చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే కొనియాడారు.