HYD: హుస్సేన్ సాగర్లో వందలాది ప్రాణాలను కాపాడిన ‘ట్యాంక్ బండ్ శివ’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించి భారీ సాయం ప్రకటించారు. శివ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని నిన్న అందజేశారు. అదనంగా శివకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉపాధి కోసం ట్యాంక్ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలన్నారు.