AP-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్ బూత్‌ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు.