BHPL: భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాల కోసం 2027 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన యువత వెబ్సైట్లో ఏప్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ సేవ చేయాలని ఎస్పీ సూచించారు.