AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ కానున్నాయి. బకాయిల విడుదలలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ నెట్వర్క్ ఆసుపత్రులు నిరసన చేపట్టనున్నాయి. ఈ మేరకు రేపటి నుంచి NTR వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని.. ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.