MHBD: మహిళలకు ప్రయోజనం మహాలక్ష్మి పథకమని తొర్రూరు డిపో మేనేజర్ పద్మావతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలు చేసి రూ.10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నట్టు వెల్లడించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు.