భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి సీతారామచంద్రస్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు వేదమంత్రాల మధ్య డోలోత్సవం జరిపారు. అనంతరం స్వామివారు సింహ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.