MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా నేటి నుండి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.