NGKL: పదర మండలంలోని మద్దిమడుగు శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం ముగ్గురు మంత్రులు రానున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ హెలికాప్టర్ ద్వారా చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారు నల్గొండ పర్యటనకు వెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు.