JGL: జగిత్యాల బార్ అసోసియేషన్‌కు మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా ఎర్ర నర్సయ్య ఎన్నికయ్యారు. జగిత్యాల బార్ అసోసియేషన్‌లో మొత్తం 264 మంది సభ్యులు ఉండగా, మంగళవారం జరిగిన ఎన్నికల్లో 235 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష స్థానానికి ఎర్ర నర్సయ్య, బాల సుబ్రమణ్యం బరిలో నిలవగా, 53 ఓట్ల మెజారిటీతో ఎర్ర నర్సయ్య విజయం సాధించారు.