IPL 2026లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇరుజట్లు ఇప్పటివరకు 7 సందర్భాల్లో తలపడగా.. తొలి 3 మ్యాచుల్లో ఢిల్లీ, చివరి నాలుగింటిలో లక్నో విజయం సాధించాయి. దీంతో ఇవాళ లక్నోను ఓడించి, ఆ జట్టు జోరుకు బ్రేక్ వేయడంతో పాటు లెక్క సమం చేయాలని ఢిల్లీ భావిస్తోంది.