VKB: తాండూరు నియోజకవర్గ పరిధిలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రూ.289 కోట్లు మంజూరు చేసినట్లు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కర్ణం పురుషోత్తం రావు తెలిపారు. సుమారు 102 కి.మీ మేర రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. ముఖ్యంగా యాలాల మండలం కోకట్ వంతెన, తాండూరు-కోటపల్లి బీటీ రోడ్డు పనులకు నిధులు విడుదలయ్యాయన్నారు.