AKP: పెదపూడి, చింతపాక గ్రామాల్లో APEPDCL ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ సమస్యలు, పీఎం సూర్యఘర్పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఏఈ వెంకటరమణ మంగళవారం తెలిపారు. చింతపాకలో ఉదయం 10 నుంచి 1 వరకు, పెదపూడిలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ప్రజల సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.