ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి స్టేజి వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఐ రాజు కథనం ప్రకారం.. మద్దులపల్లికి చెందిన ప్రసాద్ మద్దులపల్లి స్టేజి వద్ద ఉన్న దుకాణానికి వెళ్లి, తిరిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ కారు ఇతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా ఇతని నిశ్చితార్థం రేపు జరగాల్సి ఉంది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.