KMM: కల్లూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసీపీ వసుంధర యాదవ్ వాహనదారులకు సూచనలు చేశారు. బైక్ నడిపేవారు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.