TPT: పాకాల మండలం దామలచెరువు పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన టీచర్ జయచంద్రారెడ్డి దగ్గర చిత్తూరు కొంగారెడ్డిపల్లెకు చెందిన టీచర్ ప్రేమ్ కృష్ణ రూ. 4లక్షలు అప్పుగా తీసుకున్నారు. దానిని చెల్లించే క్రమంలో ప్రేమ్ కృష్ణ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. నేరం నిరూపణ కావడంతో తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి 6 నెలల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు.