BHPL: టేకుమట్ల మండలంలోని ఏంపెడు గ్రామంలో బాలింతలకు స్థానిక సర్పంచ్ హారిక పౌష్టికాహారం పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ… అంగన్వాడి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారం పిల్లలకు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో బాలింతలు, పిల్లలతో సర్పంచ్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.