VZM: మెరక ముడిదం మండలంంలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు తెలిపారు.