ASR: చింతపల్లి మండలంలో 9,092 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ. 3,84,53,000 మంజూరైనట్లు ఎంపీడీవో సీహెచ్. సీతామహాలక్ష్మి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 1న బుధవారం ఉదయం నుంచి లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్ అందించాలని సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులందరూ ఇంటి వద్దే అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని ఆమె కోరారు.