VKB: పట్టణంలోని కొత్తగడిలో వీధి కుక్కల స్వైరవిహారానికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మున్సిపల్ సిబ్బంది మంగళవారం ఉదయం కొత్తగడిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలను పట్టుకున్నారు.