HNK: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఓడితల ప్రణవ్ కలిసి వినతిపత్రం అందజేశారు. మర్రిపల్లిగూడెం నుంచి హైదరాబాద్ డైరెక్ట్ బస్సు సర్వీస్ కల్పించాలని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి, బస్టాండ్లను మరింత అభివృద్ధి చేయాలని మంత్రిని ఒడితల ప్రణవ్ కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.