MNCL: ఏకపంట సాగుతో నష్టపోకుండా, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని KVK కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన రైతులకు సూచించారు. మంగళవారం బెల్లంపల్లి కన్నాల రైతు వేదికలో పంటల విభిన్నీకరణపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మార్కెట్ పరిస్థితులను బట్టి పంటలు మార్చడం ద్వారా సాగు ఖర్చు తగ్గి, ఆదాయం పెరుగుతుందని వివరించారు.